తెలుగువారు బోరవిరుచుకుని ‘మావాడు’ అని గొప్పగా చాటి చెప్పుకునే వెయ్యి నవలల విఖ్యాత రచయిత కొవ్వలి. వ్యవహారిక భాషలో రచనలు చేసి, సామాన్య ప్రజల సాహిత్యకాంక్ష తీర్చినవాడు. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఏ భాషలోనూ వెయ్యి నవలలు రాసినవారు మనకు కనిపించరు. ఆయన రాసిన అపురూపమైన వెయ్యో నవల ఈ ‘మంత్రాలయ’. ఈ జానపద నవలను కొవ్వలివారు ప్రముఖ హాస్య నటి సూర్యాకాంతానికి అంకితం చేశారు. ద్వేషం, స్వార్థం, అధర్మాలను జయించిన మానవుడు విశ్వమానవుడవుతాడనే ఉదాత్తభావంతో రాసిన నవల. రాక్షసజాతకుడై పుట్టిన రాచబిడ్డ విధివశాన అడవిపాలై ఒక భయంకరాకారుడైన మంత్రగాడి చేతుల్లో పడతాడు. ఆ మంత్రగాడు యువరాజు శరీరంలోకి పరకాయప్రవేశం చేస్తాడు. యువరాజును తన శరీరంలోకి పంపిస్తాడు! ఆ తర్వాత ఏమైందనేదే ఈ నవల. ఆయన రాసిన మరో జానపద నవల ‘మహేంద్రజాలం’. ఒక యువరాజు కీలుగుర్రం ఎక్కి అదృశ్యమైపోతాడు. అయితే ఆ కీలుగుర్రం యువరాజును ఎక్కడకు తీసుకెళ్ళింది? యువరాజు తిరిగి తమ రాజ్యం చేరుకున్నాడా లేదా? అనేదే ఈ నవల.

మంత్రాలయ  (కొవ్వలి వారి వెయ్యవ నవల)

కొవ్వలి లక్ష్మీ నరసింహారావు 
ధర 220 రూపాయలు
పేజీలు 228
ప్రతులకు విశాలాంధ్ర, నవ చేతన బుక్‌హౌ‍స్‌లు, 
నవోదయ బుక్‌హౌస్‌, కాచిగూడ, హైదరాబాద్‌ ., www.anandbooks.com