సాహితీప్రియుడు, రచయిత, ఆంధ్రామెడికల్‌ కాలేజీ విశ్రాంత ప్రొఫెసర్‌ డా.ఆర్‌..ఎ.నాయక్‌. వేదకాలంనుంచీ భారతదేశం గురువుకు మహోన్నతమైన స్థానాన్నిచ్చింది. గురువును సాక్షాత్తూ పరబ్రహ్మగా భావించే సంప్రదాయం మనది. అటువంటి గురువు ఈ కాలంలో అవహేళనకు గురవుతున్నాడు. ఇలాంటి కాలంలో కూడా బాల్యంనాటి తొమ్మిదిమంది తన గురువులను తల్చుకుంటూ ఆ గురుశిష్యబంధంలోని స్వానుభవాలను అక్షరాలుగా మలిచిన అరుదైన పుస్తకం ఇది. రచయిత నాయక్‌ తన ఆత్మకథలో ఈ అనుభవాల్ని పొందుపరిచారు. మానవసంబంధాలు మృగ్యమవుతున్న ఈ కాలంలో ఇందులోని వాస్తవిక గురుశిష్య సంబంధాలు కొత్త తరానికి మార్గదర్శకంగా నిలుస్తాయి. 

 

మరువరాని మా గురువరేణ్యులు
స్వీయ చరిత్రాత్మకం
ఆర్‌.ఎ.నాయక్‌
ధర 200 రూపాయలు
పేజీలు 256
ప్రతులకు రచయిత, గోకుల్‌ కాంప్లెక్స్‌, మహారాణిపేట, విశాఖపట్నం–002 సెల్‌ 98 480 500 48