కవి, రచయిత, బాధ్యతాయుతమైన అధికారి బుర్రా లక్ష్మీనారాయణ. ఇరవై కథలున్న తాజా కథల సంపుటి ఈ ‘మట్టి అరుగు’. ఇతివృత్తం ఏదైనా సరే అందంగా, హృద్యంగా చెప్పడం ఆయన కథానిర్మాణంలోని ప్రత్యేకత. ఈ సంపుటిలోని టైటిల్‌ కథ ‘మట్టి అరుగు’లో ఇది స్పష్టంగా కనిపిస్తుంది. మానవత్వపు జ్ఞాపకాల ఆవేదనకు ప్రతిరూపమీకథ. కథనం మన కళ్ళకు బొమ్మ కడుతుంది. బిజీ లైఫ్‌లో మనలో కాస్తంత ఆలోచన రగిల్చి మనల్ని కదిలించే కథలే ఇవన్నీ. 

 

మట్టి అరుగు
బుర్రా లక్ష్మీ నారాయణ
ధర 100 రూపాయలు
పేజీలు 160
ప్రతులకు పాలపిట్ట బుక్స్‌, హైదరాబాద్‌–36 ఫోన్‌ 040–27678430