పూర్తిస్థాయి పెట్టుబడిదారీ వ్యవస్థగల సమాజంవైపు శరవేగంగా పరుగులు తీస్తున్న భారతీయ సమాజంలో గడచిన నాలుగు దశాబ్దాల్లో అనూహ్యమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఎన్నో వృత్తులుసహా పాత సంప్రదాయాలు, విధానాలకు కాలం చెల్లుతోంది. అవన్నీ కాలగర్భంలో కలసిపోతూ జ్ఞాపకాలుగా మిగిలిపోతున్నాయి. ఆ క్రమంలో చేసిన సూక్ష్మస్థాయీ సాహిత్య పరిశీలనలో భాగంగా వెలువడిన పుస్తకమే ఈ ‘మావూరి మంగలి కతలు’. ఇందులోని 18 కథల్లో ఒకనాటి మంగలి (నాయీబ్రాహ్మణులు) వృత్తి, వారు ఎదుర్కొన్న అణచివేత, మానసిక హింస, సంఘర్షణ, మార్పులు వంటి అనేక అంశాలు మనకు కనిపిస్తాయి. గడచిన దశాబ్దాలలోని జీవన పరిణామాల తీరుతెన్నులను కళ్ళకు కట్టే కథలివన్నీ.

 

మావూరి మంగలి కతలు
మూరిశెట్టి గోవింద్‌
ధర 100 రూపాయలు
పేజీలు 96
ప్రతులకు రచయిత, చిన్నదొరవారి కండ్రిగ, కార్వేటినగరం మండలం, చిత్తూరుజిల్లా 
ఫోన్‌ 950 2200 749