ప్రసిద్ధ కన్నడ దళిత కవి, బహుముఖ ప్రజ్ఞావంతుడు, గ్రామీణ జీవనశైలి తెలిసిన రచయిత మూడ్నాకూడు చిన్నస్వామి. ఆయన కథలకు తెలుగు అనువాదం ఈ ‘మూగడి బాధ’ పుస్తకం. అనువాదకునిగా, రచయితగా చిరపరిచితులు, ఉత్తమ ఉపాధ్యాయ గ్రహీత రంగనాథ రామచంద్రరావుగారు చిన్నస్వామిగారి కథల్లోని వాస్తవిక ఇతివృత్తాలు, చిత్రీకరణ విధానానికి అబ్బురపడి పది కథల్ని ఇలా సంకలనంగా తెచ్చారు. పాత కొత్త తరాల మూఢనమ్మకాలను, పల్లెటూరి సొబగులను, సామాజిక సత్యాలను ఆవిష్కరించే అద్భుతమైన కథలివన్నీ.

 

మూగడి బాధ
కన్నడమూలం డా.మూడ్నాకూడు చిన్నస్వామి
అనువాదం రంగనాథ రామచంద్రరావు
ధర 80 రూపాయలు
పేజీలు 96
ప్రతులకు వి.లక్ష్మీకుమారి, బేగంపేట్‌, హైదరాబాద్‌–17, నా పుస్తకం, శ్రీ రాఘవేంద్ర గ్రంథమాల, హిందూపురం –01 మరియు అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలు.