డా.అద్దంకి శ్రీనివాస్‌ వ్యాఖ్యానం రాసిన రెండు గ్రంథాలున్న ఒకే పుస్తకమిది. మొదటిది ‘విజ్ఞానేశ్వరము’. 11,12 శతాబ్దాల్లో కేతన ఈ గ్రంథాన్ని తెనిగించారు. తెలుగులో ఇదే తొలి ధర్మశాస్త్ర గ్రంథం. సాహితీప్రియులు, పరిశోధకులకు ఉపయుక్తంగా ఉండేలా ఈ  గ్రంథాన్ని వ్యాఖ్యతో అందించారు డా. అద్దంకి శ్రీనివాస్‌. నాటి న్యాయ, సామాజిక వ్యవస్థల్ని చాటిచెప్పే గ్రంథమిది.  మరొక గ్రంథం 700 ఏళ్ళనాటి అప్పనమంత్రి సంస్కృతంలో రాసిన ‘చారుచర్య (చిలుకూరి పాపయ్యశాస్త్రిగారి పరిష్కృతి) ’ను కూడా వ్యాఖ్యానంతో అందించారు శ్రీనివాస్‌. సుఖ జీవితానికి చక్కటి ఆరోగ్యనియమాల్ని చెప్పే విలువైన గ్రంథం ‘చారుచర్య’. 

 

మూలఘటిక  కేతన విజ్ఞానేశ్వరము
అప్పనమంత్రి చారుచర్య 
వ్యాఖ్యాత డా.అద్దంకి శ్రీనివాస్‌
ధర 300 రూపాయలు పేజీలు 294 
ప్రతులకు 9848881838, 9908616366, అమరావతి పబ్లికేషన్స్‌, సాయిబాబా నగర్‌, గుంటూరు