ప్రతి వైఫల్యమూ విజయానికి మెట్టు. సోవియట్‌ యూనియన్‌లో కుట్రలూ, కూహకాలకు బలైన డెబ్భై ఏళ్ళ ప్రయోగానిది కూడా అదే దారి అంటారు లెఫ్ట్‌ మేథావులు. కారల్‌ మార్క్స్‌ పై పట్నాలో ఐదు రోజుల అంతర్జాతీయ సదస్సు నేపథ్యంలో యాదృచ్ఛికంగా బుక్‌ మార్కెట్లోకి వెలువడిన భిన్నమైన పుస్తకం 31 వ్యాసాలు గల ‘ముగిసిన అధ్యాయం మార్క్సిజం’. సమసమాజం అసాధ్యం అంటూ రచయిత వుప్పల నరసింహం ఈ పుస్తకంలో గట్టిగా వాదించారు. ,కృత్రిమ మేధ కావాలనీ, మార్క్సిజం వద్దనీ స్పష్టీకరించారు. 

 

ముగిసిన అధ్యాయం మార్క్సిజం
వుప్పల నరసింహం
ధర 125 రూపాయలు
పేజీలు 132
ప్రతులకు గన్నం పబ్లికేషన్స్‌, ఇతర ప్రముఖ పుస్తక దుకాణాలు