మురళి వూదే పాపడు మరికొన్ని కథలు

దాదాహయాత్‌

ధర 150 రూపాయలు

పేజీలు 228

ప్రచురణ: అమరావతీ పబ్లికేషన్స్‌ , గుంటూరు–7

ప్రతులకు: విశాలాంధ్ర , నవచేతన బుక్‌హౌస్‌ బ్రాంచీలు

పాలకులు మారుతున్నా ఆ ‘కుర్చీ’ స్వభావం, పాలితుల తలరాతలు మారలేదన్న సామాజిక వాస్తవాలను ప్రతిబింబించే 22 కథల సంపుటిది. రాజ్యవ్యవస్థ స్వభావాన్నీ, దాని ‘స్తంభాల’ కిందపడి నలిగిపోతున్న మనుషుల బతుకుల తీరుతెన్నులనూ చిత్రించిన కథలివన్నీ. 80వ దశకం నుంచి కొత్త శతాబ్దారంభం వరకు ఇరవైఏళ్ళ కాలపరిణామాల ప్రభావానికి అక్షరరూపం.రాతి హృదయాలను కరిగించలేకపోయిన అభంశుభం తెలియని ప్రకృతికన్య తపనకు తార్కాణం టైటిల్‌ కథ ‘మురళి వూదే పాపడు’. కూర్చున్న కొమ్మను నరుక్కునే మనిషి స్వభావం మారాలనే ధరణి వేదనకు దర్పణమీకథ. సామాజిక దృక్పథంగలవారంతా చదివితీరాల్సిన కథలివన్నీ.