రెండు తెలుగు రాష్ర్టాలు ఏర్పడ్డాక నవ్యాంధ్రప్రదేశ్‌లో విద్యార్థులకు ఉపయుక్తమయ్యేరీతిలో చరిత్రను లోతుగా అధ్యయనం చేసిన డా.ముప్పాళ్ళ గ్రూప్‌–1, గ్రూప్‌–2, 3,4 పరీక్షలకు ఉపయోగపడేలా ఈ పుస్తకాన్ని తీర్చిదిద్దారు. నవ్యాంధ్రప్రదేశ్‌ విద్యార్థులకు అదనపు సమాచారం అందించారు. పలు ప్రాంతాలను పరిపాలించిన వంశాల చరిత్ర వెలికితీసి ఇందులో పొందుపరిచారు. శాతవాహనుల చరిత్రను కూడా అందుకు అనుగుణంగానే అందించారు. నవ్యాంధ్ర భౌగోళిక పరిస్థితులు మొదలు, చారిత్రక పూర్వయుగం, వివిధ ప్రాంతాలు పాలించిన వంశాలు, జాతులు, ప్రాచీన రాజ్యాలు, సీమ చరిత్ర, ముస్లిం పాలన, ఆధునిక చరిత్ర, ఆంగ్లేయుల పాలన, జాతీయోద్యమం, త్యాగాలు, రాజకీయ పరిస్థితి, కమ్యూనిస్టులు, రైతు ఉద్యమాలు, ఆంధ్రప్రదేశ్‌ అవతరణ, సామాజిక, ఆర్థిక చరిత్ర, రాష్ట్ర విభజన, పంపకాలు, ప్రత్యేక హోదా, లేటెస్ట్‌ సమాచారం ఈ పుస్తకంలో జోడించారు. 

నవ్యాంధ్రప్రదేశ్ సమగ్ర చరిత్ర సంస్కృతి

డా. ముప్పాళ్ళ హనుమంతరావు
‍ధర 350 రూపాయలు
పేజీలు 728
ప్రతులకు జి.తులసి రాముడు, గాంధీనగర్‌, హైదరాబాద్‌–020 ‍సెల్‌ 766 00 91 982