కథానవలా రచయిత, అనువాదకుడు రాచపూటి రమేష్‌. చేనేతవృత్తి కార్మికులతో ఆయనకున్న అపారమైన అనుబంధాన్ని పురస్కరించుకుని రమేష్‌ రాసిన 17 చేనేత కథల సంపుటి ఈ పుస్తకం. టైటిల్‌ కథ ‘నెమలికన్ను చీర’ ఒక గజనేతగాడి జీవిత చిత్రణ. ఆత్మహత్యాయత్నం చేసిన గజనేతగాడు నారాయణకు కేంద్ర ప్రభుత్వం అవార్డు, కాశీ చీరలవ్యాపారి ఆర్డరు దక్కించుకోవడం, అతడి కష్టాలు గట్టెక్కడమే ఈ కథ సారాంశం. చేనేతరంగ సంక్షోభం, ఆ కార్మికులెదుర్కొంటున్న సవాళ్ళు, సమస్యలను కళ్ళకు కట్టిన కథలివన్నీ. 

 

నెమలికన్ను చీర
చేనేత కథల సంకలనం
రాచపూటి రమేష్‌
ధర 90 రూపాయలు
పేజీలు 108
ప్రతులకు నవచేతన పబ్లిషింగ్‌హౌస్‌, నవచేతన బుక్‌హౌస్‌లు.