కవి, కథకుడు, ప్రపంచ సాహిత్య పరిశీలకుడు, సైన్స్‌ రచయిత, అనువాదకుడు, బహుముఖ ప్రజ్ఞాశీలి కె.బి.గోపాలం. ఆయన రాసిన తాజా చారిత్రక నవల ‘నూర్‌ మహల్‌’. నూర్జహాన్‌గా ఆమె ప్రసిద్ధురాలు. మొఘల్‌ సామ్రాజ్యాన్ని ఒంటిచేతిమీద నడిపించిన మహారాణి కథే ఈ నవల.  1605లో సింహాసనం అధిష్టించిన జహంగీర్‌ భార్యలలో ప్రియభార్యగా రాజ్యపాలన చేసిన నూర్‌ జహాన్‌ పర్షియా దేశస్తురాలు. అసలు పేరు మిహ్రున్నీసా. ఆమె తెలివితేటలు, మానసికస్థైర్యం, కవితాశక్తిని అర్థంచేసుకున్న జహంగీర్‌ ఆమెకు దాసుడయ్యాడు. క్లియోపాత్రా, కాతరీన్‌ డీ మెడిచి (పారిస్‌)లాగా అధికారం చెలాయించినదేగానీ వారిలా నూర్‌జహాన్‌ క్రూరురాలు కాదు. పురుషాధిక్య రాచరిక ప్రపంచంలో బతుకుతో పోరాడి అడుగడుగునా అడ్డంకులను అధిగమించిన ధైర్యశాలి నూర్‌జహాన్‌ కథను ఎంతో హాయిగా చదివించే పుస్తకమిది. 

 

నూర్‌ మహల్‌ (చారిత్రక నవల)
కె.బి. గోపాలం
ధర 250 రూపాయలు
పేజీలు 270
ప్రతులకు  అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలు