యువతమోటివేట్‌చేసే, స్ఫూర్తినిచ్చే గొప్ప వక్త డా.బి.వి.పట్టాభిరామ్. ఇప్పటికే 50కిపైగా పుస్తకాలతో తెలుగువారికి ఆయన సుపరిచితులు. వ్యక్తిత్ నిర్మాణానికి ఆయనిచ్చే సూచనలు పాటిస్తూ మార్చుచెందడమేకాదు, యూట్యూబ్‌లో లక్షలాదిమంది ఆయనున అనుసరిస్తున్నారు. అత్యధికంగా అమ్ముడయ్యే పుస్తకరచయితగా నిలిచారు. ఈ తాజా పుస్తకం ‘పట్టాభి రామబాణం’.  సమాజంలో మనల్ని మంచి వ్యక్తిగా, ఉన్నతస్థానానికి ఎదిగే వ్యక్తిగా నిలబెట్టేందుకు దోహదపడే మరోపుస్తకమిది. ఇందులోని 39 శీర్షికల్లో, మనం తెలుసుకోవాల్సినవేమిటో, ఎలా మాట్లాడాలో, మనల్ని మనం ఎలా తెలుసుకోవాలో, మనపైన మనం ఎలా విశ్వాసం పెంపొందించుకోవాలో, మన యాటిట్యూడ్‌ ఎలా ఉండాలో ఈ పుస్తకం చదివి తెలుసుకోవచ్చు.

 

పట్టాభిరామబాణం
డా.బి.వి.పట్టాభిరామ్‌
ధర 100 రూపాయలు
పేజీలు 190
ప్రతులకు ఎమెస్కో బుక్స్‌, చంద్రం బిల్డింగ్స్‌, సి.ఆర్‌.రోడ్‌, చుట్టుగుంట, విజయవాడ–04