క్రైమ్ కథలు రాయడం కష్టం. ఎందుకంటే బిగువు సడలకుండా కథనం నడిపించాలి. సస్పెన్స్‌ కొనసాగించాలి. పాఠకులతో చదివించగలగాలి. అలాంటి 14 కథల సంకలనమే ఈ సస్పెన్స్‌ కథల పుస్తకం. రాగాల రహస్యం, వజ్రాల రహస్యం, దేవ రహస్యం, బంగ్లా రహస్యం సహా చెక్‌మేట్‌ కథ చదివి తీరాల్సిందే. మనలోఉండే ధనాకాంక్ష, స్ర్తీ ఆకాంక్షలు, ఇతర బలహీనతలను చాటిచెప్పే కథలివన్నీ. 

రాగాల రహస్యం (సస్పెన్స్‌ కథలు)
రాచపూటి రమేష్‌
ధర 100 రూపాయలు
పేజీలు 136
ప్రతులకు విశాలాంధ్ర, ప్రజాశక్తి, ఇతర ముఖ్యమైన బుక్స్‌స్టాల్స్‌