మూఢనమ్మకాల్లో, నిస్సహాయస్థితిలో కూరుకుపోయిన రష్యా జారిస్టు రాజ్యవ్యవస్థ కూలిపోయిన దశలో ప్రజలు దేశాధికారాన్ని ఎలా హస్తగతం చేసుకున్నారో వివరించే పుస్తకం ‘రష్యా విప్లవం:ప్రజల చరిత్ర’. ప్రజలను యంత్రాలుగా, వేతన బానిసలుగా మార్చిన పెట్టుబడిదారీ శిబిరానికి సమాంతరంగా రష్యాలో జారిస్టు దద్దమ్మ పాలనను అంతమొందించిన లెనిన్‌ విప్లవ ప్రభుత్వం. లక్షలాదిమంది రైతులు, కార్మికుల ప్రజలు చేసిన ఈ ప్రాణ త్యాగాల చరిత్రను చెప్పే ఈ పుస్తకం ఎన్నో సరికొత్త విషయాల్ని మనదృష్టికి తెస్తుంది. ప్రముఖ అనువాదకుడు, రచయిత ముక్తవరం పార్థసారధి అందరితోనూ శ్రద్ధగా చదివించేట్టు సరళభాషలో చేసిన అనువాదమిది.

 

రష్యన్‌ విప్లవం, ప్రజల చరిత్ర
నీల్‌ ఫాక్నర్‌ 
తెలుగుసేత ముక్తవరం పార్థసారథి
ధర 120 రూపాయలు
పేజీలు 166
ప్రతులకు నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌, నవచేతన బుక్‌హౌస్‌లు