యాభైమూడేళ్ళక్రితం కలంపట్టిన రచయిత్రి డా.లక్ష్మి రాఘవ. అయినప్పటికీ ఆమె కథలు నిత్యనూతనంగా ఉంటాయి. మానవసంబంధాలను ఆవిష్కరించే కథలు రాస్తారు లక్ష్మి రాఘవ. తొమ్మిది చిన్న కథలతోపాటు మొత్తం 32 కథలున్న ఆమె తాజా సంపుటిలో ఆధునిక పోకడలవల్ల కలిగే నష్టాలను చర్చించారు. టైటిల్‌ కథ ‘స్మార్ట్‌ జీవితం’లో తండ్రి దగ్గరుండే ఖరీదైన ఫోను పోతుంది. ఆ ఫోను ఎందుకు పోయిందో, ఎలా పోయిందో, దాని వెనుక ఉన్న కారణం ఏమిటో తల్లిదండ్రులందరూ తప్పక తెలుసుకోవాలి. కుటుంబజీవితంలో చేసే చిన్న చిన్న తప్పులవల్ల కలిగే పెద్ద పెద్ద నష్టాల్ని నివారించుకోవాలంటే ఇలాంటి మంచి కథలు చదివి తీరాల్సిందే.

 

స్మార్ట్‌ జీవితం
డా.లక్షీ్ రాఘవ
ధర 100 రూపాయలు
పేజీలు 144
ప్రతులకు జ్యోతివలబోజు, ఫోన్‌ 80 963 10 140 మరియు అన్ని ప్రముఖ పుస్తక దుకాణాలు