ప్రముఖ రచయిత ముత్తేవి రవీంద్రనాథ్‌. ఇంతకుముందే ఆయన తెనాలి రామకృష్ణకవి అనే శాస్త్రీయ పరిఃశోధనాగ్రంథం రాశారు. ఇప్పుడీ తాజా పుస్తకం కూడా అలాంటిదే. శ్రీకృష్ణదేవరాయలు తెలుగునేలపై జన్మించాడని ఆయన నిరూపించారు. రాయలు తండ్రి నరసనాయకుడు పదహారణాల తెలుగువాడు. ఆయన భార్యలూ తెలుగువారే. రాయలు ముత్తాత తిమ్మయ్య మాతృభాష తెలుగు. రాయలు నాయనమ్మ బుక్కాంబ, తల్లి నాగులాంబ, సవతి తల్లులు తిప్పాంబ, ఓబాంబ, భార్యలు తిరుమలాంబ, చిన్నాంబ మొదలైన తుళువరాణులంతా ఆంధ్రనారీమణులే. రాయలు మంత్రి తిమ్మరుసు తెలుగు నియోగి బ్రాహ్మణుడు. ఇలా ఈ పుస్తకంలో రచయిత రాయలు గురించి ఎన్నో గొప్ప విషయాలు మనకు తెలియజేశారు.

 

శ్రీకృష్ణ దేవరాయలు వంశ మూలాలు
ముత్తేవి రవీంద్రనాథ్‌
ధర 200 రూపాయలు
పేజీలు 222
ప్రతులకు నవచేతన ప్రచురణసంస్థ, బండ్లగూడ, నాగోల్‌, హైదరాబాద్‌ ఫోన్‌ 040–24224458/59
విశాలాంధ్ర ప్రచురణ సంస్థ, చుట్టుగుంట, విజయవాడ –4 ఫోన్‌ 0866–2430302