తరాల అంతరాలు, జీవన పరిస్థితులు, మారుతున్న కాలం...ఇవన్నీ పెద్దలను పిల్లలనుంచి దూరంచేస్తున్నాయి. జీవనయానంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని బాధ్యతలన్నీ తీరాక తమకంటూ కాస్తంత సమయం కేటాయించుకోవాలనిపిస్తుంది పెద్దలకు. తమదైన జీవితం గడపాలనిపిస్తుంది. అలాంటి పెద్దలనే కథావస్తువుగా మలచి, వారి సమస్యలతోపాటు, వారి మనోభావాలను కళ్ళకు కట్టినట్టు ఆవిష్కరించారు రచయిత్రి పోలంరాజు శారద. చక్కని భాషతో, నవల ఆద్యంతం ఆసక్తికరంగా మలచారు. 


-లక్ష్మీనర్మద

స్వర్ణకుటీరం (నవల)
పోలంరాజు శారద
ధర: 120 రూపాయలు
పేజీలు: 151
ప్రతులకు: జ్యోతి వలబోజు
ఫోన్‌: 80963 10140
మరియు అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలు