స్వేచ్ఛ అంటే విచ్చలవిడితనం అని భావిస్తారు. జంతువులా జీవించడం స్వేచ్ఛ కాదు. అందరూ స్వేచ్ఛ కోరుకుంటారు. కానీ అందులో బాధ్యత కూడా ఉంటుంది. అది స్వీకరిస్తేనే స్వేచ్ఛ, హాయి. బాధ్యతారాహిత్యమైన స్వేచ్ఛవల్ల మనిషి పతనమవుతాడు. స్వేచ్ఛకు నిర్వచనం, అవగాహన కలిగించే ఓషో పుస్తకమిది. మనం భూమ్మీద సంకెళ్ళులేకుండా జన్మించాం. కానీ సంకెళ్ళుపడుతున్నాయి. భౌతికస్వేచ్ఛ, మానసిక స్వేచ్ఛ, ఆధ్యాత్మిక స్వేచ్ఛ వీటి గురించి మనకు తెలియజెప్పేదే ఈ పుస్తకం. మనం స్వేచ్ఛగా ఉండాలంటే నిర్ణయం తీసుకోవద్దంటుందీ పుస్తకం! విచిత్రంగా లేదూ. అందుకే చదవండి దీన్ని.

 

స్వేచ్ఛ (మీరనుకుంటున్నదికాదు)
ఓషో నవజీవన మార్గదర్శకాలు
అనువాదం భరత్‌
ధర 225 రూపాయలు
పేజీలు 164
ప్రతులకు 9666155555, 9293226169