భావి తరాలకు ఉపయుక్తమైన రీతిలో తెలంగాణ చరిత్రను చాటిన విశేష గ్రంథమిది. ఒక సంకల్పంతో తెలంగాణ సాహిత్య అకాడమీ సదస్సులు నిర్వహిస్తూ, ఆ సదస్సు పత్రాలను ఇలా పుస్తకరూపంలో చరిత్రగా ముద్రిస్తోంది. ఆ పరంపరలో భాగంగా, ‘కాకతీయుల నుండి అసఫ్‌జాహిల దాకా’ జరిగిన తెలంగాణ చరిత్రను ఇలా పుస్తకంగా తెచ్చింది. కాకతీయుల పాలన, ఓరుగల్లు కేంద్రం, వ్యవసాయాభివృద్ధి, కళాసంస్కృతుల వికాసం, భాషా సాహిత్యాల పరిశీలన, నాణాలు, శాసనాలు, నిర్మాణాలు, కాకతీయుల పతనం, సామంతరాజ్యాలు, సంక్షోభాలు, బహమనీయులు, కుతుబ్‌షాహిలు, జనజీవనం మొదలు అసఫ్‌ జాహిలవరకు వివిధ చరిత్ర రచయితల విశ్లేషణల కలబోత ఈ పుస్తకం.

 

తెలంగాణ చరిత్ర, సంస్కృతి, భాష, సాహిత్యం
(కాకతీయుల నుండి అసఫ్‌ జాహిల వరకు)
సంపాదకులు ఆచార్య జి. అరుణకుమారి, డా.మల్లెగోడ గంగాప్రసాద్‌
ధర 250 రూపాయలు
పేజీలు 480
ప్రతులకు అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు