సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లోనూ రచనలు చేసిన ఏకైక రచయిత్రి శారదా అశోకవర్ధన్‌. నాలుగు దశాబ్దాల కెరీర్‌లో 77 పుస్తకాలు వెలువరించారు. బాలసాహిత్యంలో 17 పుస్తకాలు రాశారు. పిల్లలకు మంచిచెడులతోపాటు భారతీయ సంస్కృతీ సంప్రదాయాల్ని తెలియజెప్పేందుకు ఆవిడ రాసిన మూడు తాజా పుస్తకాలివి. ఇందులో ఒకటి ‘తెలుగు భాషా వీచికలు’. తెలుగు భాషా సాహిత్యాలను, సంస్కృతిని సుసంపన్నం చేసిన103 మంది కవులు, రచయితలు, కళాకారుల పరిచయ కృతి ఈ పుస్తకం. 

అదేవిధంగా, రుక్మిణీ కల్యాణ కథతోపాటు, మనవైన సంప్రదాయ పండుగలు, జాతీయ పర్వదినాలను పిల్లలకు చక్కగా వివరించే మరో పుస్తకం ‘రుక్మిణీ కల్యాణం’. కాగా మరొకటి, తొలి తెలుగు బాలకథా విజ్ఞాన సర్వస్వం ‘చిన్న పిల్లలకు చిట్టి కథలు’ పుస్తకం. ఇందులోని 116 కథలు పిల్లల మానసిక వికాసానికి, వారి ఆనందానికి, ఆహ్లాదానికి, పిల్లలకు మంచి అలవాట్లు నేర్పడానికి దోహదం చేస్తాయి. 

 

తెలుగు భాషావీచికలు
శారదా అశోకవర్ధన్‌
ధర 150 రూపాయలు

పేజీలు 160‍

ప్రతులకు  రచయిత్రి, సికింద్రాబాద్‌– 03 ఫోన్‌ –040–2780366., నవచేతన, నవోదయ, నవయుగ, తెలుగు బుక్‌హౌస్‌లు, బుక్‌ లింక్‌ కార్పొరేషన్‌, హైదరాబాద్‌.