తూరుపు సిందూరంబీ.హెచ్‌.వీ.మంగేష్‌ధర 150 రూపాయలుపేజీలు 262ప్రతులకు ఎమెస్కో బుక్స్‌, 1–2–7, భానూ కాలనీ, గగన్‌మహల్‌రోడ్‌, దోమల్‌గూడ, హైదరాబాద్‌–29, చంద్రంబిల్డింగ్స్‌, చుట్టుగుంట, విజయవాడ–04జర్నలిస్టు రచయిత మంగేష్‌. ఆంధ్రజ్యోతి తూర్పుగోదావరిజిల్లా ఎడిషన్‌లో 70 వారాలు మంగేష్‌ రాసిన వ్యాసాల సంపుటి ఇది. ప్రస్తుత కాలమాన పరిస్థితులకు అనుగుణంగా కుటుంబాన్నీ, సమాజాన్నీ, మన పరిసర వాతావరణాన్నీ ఎలా తీర్చిదిద్దుకోవాలో చెప్పే వ్యక్తిత్వ వ్యాసాలివి. కారుచీకటిలో కాలిబాటను చూపించే దారిదీపం ఈ పుస్తకం. ఆధునిక జీవితాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇంట్లో సమస్యలు ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా ప్రవర్తించాలి, సుఖంగా ఎలా జీవించాలో చెప్పే అరవై వ్యాసాలివి. రాత్రి నిద్ర ముందో, ఉదయం బయటకెళ్ళేముందో ఈ పుస్తకం చదువుకుంటే చాలా సమస్యల్ని మనం సునాయాసంగా పరిష్కరించుకోగలుగుతాం.కథ 2016ధక 70 రూపాయలుపేజీలు 216ప్రతులకు విశాలాంధ్ర, నవచేతన, నవోదయ, ప్రజాశక్తి బుక్‌హౌస్‌లుఇరవైఏడేళ్ళుగా ఏటా ఉత్తమ కథలసంకలనాలు తెస్తోంది కథాసాహితి. తానా సాయంతో తక్కువధరకే పుస్తకాలిస్తోంది.సమాజంలో కొన్నేళ్ళుగా వచ్చిన మార్పులను, మానవ సంబంధాలకు మనమిచ్చే సరికొత్త నిర్వచనాలను కళ్ళముందుంచుతుంది ఈ ‘కథ 2016’ పదిహేనుకథల సంపుటి.