హిందూ మతాచార్యులలో అగ్రగణ్యుడు రామానుజాచార్యులవారు. 2017 నాటికి ఆయన జన్మించి వెయ్యి సంవత్సరాలు. రామానుజాచార్యుని ప్రియభక్తుడు వరకవి భూమగౌడు (1875–1950) జీవిత చరిత్ర పుస్తకాన్ని ఈ సహస్రాబ్ది సందర్భంగా విడుదల చేశారు. సామాన్య గీత కార్మికుడు వరకవి కైరం భూమగౌడు రామానుజాచార్యులవారి మార్గంపట్టి భూమదాసుగా మారి వైష్ణవ ప్రచారం చేసిన వాగ్గేయకారుడు. ఈ పుస్తక రచయిత వేముల ప్రభాకర్‌ మాతామహుడే వరకవి భూమగౌడు. నిజాం నియంతపాలన, దొరలదోపిడీ, జనం బాధలు, పటేల్‌ పోలీసుచర్య వరకు తెలంగాణ చరిత్ర, సామాజిక దృక్కోణాలను కూడా ఆవిష్కరించిన నవల ఈ పుస్తకం.

 

వరకవి భూమగౌడు
రామానుజ సహస్రాబ్ది కానుక
వేముల ప్రభాకర్‌
ధర 200 రూపాయలు
పేజీలు 242
ప్రతులకు వేముల రోహిత్‌, అడ్వకేట్‌, ఫ్లాట్‌ నెం 103, మనస్విని హోమ్స్‌, రోడ్‌ నె0 6, ఆల్వాల్‌హిల్స్‌, సికింద్రాబాద్‌–10 సెల్ 7893819376