హృదయాన్ని హత్తుకునేలా కవిత్వం చెప్పే తెలంగాణ కవి బండారి రాజ్‌కుమార్‌ తాజా కవిత్వం ‘వెలుతురు గబ్బిలం’. ఈ టైటిల్‌ చూడగానే, కాశీవిశ్వేశ్వరునికి తన సందేశం వినిపించమన్న నవయుగ కవి చక్రవర్తి జాషువా ‘గబ్బిలం’ గుర్తుకొస్తుంది. తర్వాత ఆ కోవలోనే ఎండ్లూరి సుధాకర్‌ ‘కొత్త గబ్బిలం’ గుర్తుకొస్తుది. 52 కవితలున్న ఈ సంపుటి తెలంగాణ బతుకుచిత్రానికి అక్షరరూపం. ‘నేలను తవ్వుకుంట బోతనే వున్న.....ఇంకా లోతుకు....ఆ పయనం సాగుతనే వుంది....పాలనురగలుగక్కే అలల సర్పాలు పాదాల్ని సుట్టేత్తాంటె/తప్పించుకుంటానికి తడిలేని నేల దొరక్కపారిపోతుంటే....వేయితలల కెరటమొకటి తరుముకొస్తూ... ఎన్నుమీద ఇర్సుకపడుతుంటే...దిగ్గున లేచికూసున్న!....అంటూ సాగుతుంది ఆయన కవిత్వం. 

 

వెలుతురు గబ్బిలం
బండారి రాజ్‌కుమార్‌
ధర 60 రూపాయలు
పేజీలు 136

ప్రతులకు రచయిత, పాతమద్ధుంపురం. వరంగల్‌ రూరల్‌, 

సెల్‌ 9959914956 మరియు అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు