అరచేతిలో ఇమిడిపోయే అద్భుత పుస్తకం మురళీధర్‌ రాసిన ‘విజయానికి విటమిన్లు’. చూడగానే ఇటే మనసును ఆకట్టుకునే ఈ పుస్తకం రూపంలోనే కాదు, కంటెంట్‌లో కూడా మన వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తుంది. రోజుకొకటి చొప్పున పేజీకొక విజయసూత్రం చొప్పున 365 గెలుపు సూత్రాలందించారు. ‘జీవితం ఎప్పడూ నీకొక అవకాశం కల్సిస్తుంది. దాన్ని మనం ‘రేపు’ అంటాం’, ‘సానుభూమి పొందేలా ఉండటంకన్నా, అసూయపడేలా ఉండటం మిన్న’, ‘విజయాన్ని ఆకర్షించే అయస్కాంతం నీ దరహాసం’....లాంటి సింగిల్‌ లైన్‌ చిట్కాలు మనలో నిత్యం స్ఫూర్తి నింపుతాయి.

 

విజయానికి విటమిన్లు
రోజుకొకటి చొప్పున 365 రోజులకు
ఇసనాక మురళీధర్‌ 
ధర 120 (పాపులర్‌ ఎడిషన్‌), 190 (డీలక్స్‌ ఎడిషన్‌
పేజీలు 368
ప్రతులకు  రచయిత ఫోన్‌ 9030601919, దీపికాపబ్లికేషన్స్‌, జయప్రకాష్‌నగర్‌, ఎర్రగడ్డ, హైదరాబాద్‌ –73