దాంపత్యం సజావుగా సాగాలంటే భార్యాభర్తలు పాటించాల్సిన అంశాలేమిటో ఈ పుస్తకం బోధపరుస్తుంది. ముందుమాటలో డా.బి.వి.పట్టాభిరామ్‌ అన్నట్టు సంసారిక వ్యవహారాల్లో ఎప్పుడైనా చికాకు కలిగినప్పుడు ఇందులో అయిదారు పేజీలు చదివితే మనసుకు ఊరట కలుగుతుందనడంలో సందేహం లేదు. నవదంపతులకే కాదు, వయసుమళ్లిన వారి విభేధాల చిక్కుముడిల్ని సైతం విప్పదీసి కుటుంబాన్ని గాడిన పెట్టడానికి సహకరించే మంచి పుస్తకం. సలహా చెప్పడానికే వేల రూపాయల్ని వసూలు చేస్తున్న ఈ రోజుల్లో ఇలాంటి పుస్తకాల అవసరం ఎంతయినా ఉంది.

 

- వాడ్రేవు వీరలక్ష్మీదేవి

వివాహాలు, విభేదాలు (ఫ్యామిలీ కౌన్సిలింగ్‌)
డాక్టర్‌ గొడవర్తి సత్యమూర్తి
పేజీలు : 219, వెల : రూ.150
ప్రతులకు : 99483 35306