Telugu Jokes in Andhrajyothi

తేడా

ఫ్రెండంటే!
నువ్వు జైల్లో ఉంటే, బెయిల్‌ ఇచ్చి విడిపించేవాడు.
బెస్ట్‌ ఫ్రెండంటే!
నీతో పాటు పట్టుబడేవాడు.

 

ఉద్యోగి వేదాంతం!

ఎక్కువ పని చేస్తే ఎక్కువ తప్పులు చేస్తాం. తక్కువ పని చేస్తే తక్కువ తప్పులు చేస్తాం. అసలు ఏ పనీ చేయకపోతే, తప్పులు చేసే అవసరమే ఉండదు. అందుకే... పని చేయనివాడికే ప్రమోషన్‌ వస్తుంది. ప్చ్‌!
 

 

భలే బేరం

ఈ గడి యారం ఖరీదు ఎంత?
అయిదు ముద్దులు!
ఆ బొమ్మ ఖరీదు ఎంత?
పది ముద్దులు!
సరే! ఆ రెండూ నాకు కావాలి.
మరి బిల్లు సంగతో!
మా డాడీ వచ్చి నీ బిల్లు 
పే చేస్తారు.

 

కనబడుటలేదు

సురేష్‌ ఫేస్‌బుక్‌ వాల్‌ మీద వాళ్ల నాన్నగారు ఇలా రాశారు... ‘బాబూ ఇప్పటికైనా నీ కంప్యూటర్‌ షట్‌డౌన్‌ చేసి గదిలోంచి బయటకి రా! నిన్ను చూసి రెండు రోజులైపోయింది. ఇవాళైనా కలిసి భోజనం చేద్దాం’. సురేష్‌ మనసు కరిగిపోయింది. ఓ లైక్‌ కొట్టి, బ్రౌజింగ్‌ కొనసాగించాడు.
 

 

పచ్చి అబద్ధం

పాలు తాగితే బలం వస్తుందని ఎవరు చెప్పారు? నాలుగు గ్లాసుల పాలు తాగినా ఎదురుగా ఉన్న గోడని కదిలించలేం. కానీ ఓ గ్లాసుడు ఓడ్కా తాగితే, గోడ దానంతట అదే కదిలిపోతుంది.

 

 

భవిష్యత్తు

ఓ కప్ప జ్యోతిషుడి దగ్గరకు వెళ్లింది. ‘కప్పలు, అందమైన అమ్మాయిలను కలుసుకున్న కథ చదివాను. నేను కూడా అలా ఓ అమ్మాయినికలుసుకుంటానా?’ అని ఆశగా అడిగింది.

‘తప్పకుండా! వచ్చే ఏడాది ఓ బయాలజీ క్లాస్‌లో’ అంటూ శూన్యంలోకి చూస్తూ బదులిచ్చాడు జ్యోతిషుడు.

 

పని.. పని.. పని

ఆవిడ కిరాణా షాపుకి వెళ్లి ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, గసగసాలు అన్నీ పావు కిలో చొప్పున ఒకే కవర్లో వేసి కట్టమని చెప్పింది.
‘అన్నీ కలిపేయాలా! ఎందుకలా? ఏదన్నా కొత్త వంటకం ట్రై చేస్తున్నారా’ అని అడిగాడు షాపు వాడు.
‘వంటకమా పాడా! మా అత్తయ్యగారు ఓ వారం పాటు ఇంట్లో ఉండటానికి వస్తున్నారు. ఇవన్నీ ఇచ్చి వేరు చేయమని అడిగితే ఇక నా జోలికి రారు కదా!’ అని మూతి విరుచుకుంటూ బదులిచ్చింది సూర్యకాంతమ్మగారి కోడలు.

 

మగబుద్ధి

బస్టాండులో ఉన్న ఆ యువకుడి అందం చూసి, ఓ అమ్మాయికి మతిపోయింది. వెంటనే దగ్గరకి వెళ్లి- ‘నువ్వంటే నాకిష్టం. అలా కాఫీకి వెళ్దాం వస్తావా!’ అని అడిగింది. ఆ మాటలకి అబ్బాయి అగ్గి మీద గుగ్గిలం అయిపోయాడు. ‘ఇదంతా వయసు వల్ల కలిగే ఆకర్షణ. ముందు కెరీర్‌ మీద దృష్టి పెట్టు. అప్పుడు నాకంటే మంచివాడు దొరుకుతాడు’ అని చెప్పాడు. కాగితంపై ఏదో రాసి... ‘ఇందులో మంచి సూక్తులు ఉన్నాయి. వెళ్లి చదువుకో’ అంటూ ఓ పేపరు చేతిలో పెట్టాడు. ఇంటికెళ్లాక దాన్ని చూసిందా అమ్మాయి- ‘పిచ్చిదానా! వెనకే ఉన్న నా భార్యని నువ్వు చూసినట్టు లేదు. రేపు సాయంత్రం ఈ నెంబరుకి ఫోన్‌ చెయ్‌! కాఫీకి వచ్చేస్తాను’ అని రాసి ఉంది.

 

Page: 1 of 113
Copyright and Trade Mark Notice © owned by or licensed to Aamodha Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.