ఇందిర రైలెక్కిన దగ్గర్నుంచి చుట్టూ ప్రపంచంతో తనకు సంబంధం లేనట్టు, నిర్వికారంగా అలా కూర్చునే ఉంది. శరీరం, మనసు అలిసినట్టున్నా కంటి మీదకి కునుకు రాలేదు. తన లోపల్లోపల ఒక ఖాళీతనం! ఇది మోయలేని బరువుగా తోస్తుందెందుకు? తన భర్త మోహన్రావుకి చెబితే ఏమంటాడు? నవ్వుతాడు. ఎక్కువగా ఆలోచిస్తున్నావంటాడు.. నిజమేనేమో!

జీవితాన్ని మరింత విశాలంగా చూడమని అతను చెబుతున్నా తనకి చేతకావటం లేదు. ఉన్నట్టుండి ఒక దిగులు కెరటం ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. అలాటప్పుడు తన చిన్న ప్రపంచంలోకి మాత్రమే తొంగి చూస్తుంది.ఫఫఫఅకస్మాత్తుగా వచ్చిన తల్లిని చూసి రూప ఆశ్చర్యపోయింది. ‘‘అదేమిటమ్మా, చెప్పనే లేదు నువ్వు వస్తున్నట్టు! నాన్న ఏరి?’’ అంది.‘‘ఏమోనే చూడాలనిపించింది, వచ్చేసాను. ప్రియ ఏది?’’‘‘వస్తుంది, శ్రీఅల్లుడుగారి ఆఫీసుకి దగ్గరగా మంచి బేబీ సిట్టర్‌ దొరికింది, తను వచ్చేప్పుడు తీసుకొస్తాడు’’ అల్లరిగా నవ్వింది రూప. ఇందిర అల్లుణ్ణి గురించి ఎవరితోనైనా మాట్లాడేప్పుడు అల్లుడుగారు అంటూ సంబోధిస్తుందని రూప, ‘అల్లుడుగారేం, శ్రీఅల్లుడుగారు అని చెప్పు. మరింత గొప్పగా ఉంటుంది’ అని ఉడికిస్తుంటుంది.మాట్లాడుతూనే పెట్టెలో బట్టలు సర్దుకుంటూన్న కూతుర్ని చూసి, ‘‘ఎటైనా ప్రయాణం పెట్టుకున్నారా?’’ అంది ఇందిర.

తల్లికి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ, ‘‘ప్రయాణం బడలిక తీరుతుంది, స్నానం చేసిరామ్మా’’ అంటూనే, తల్లికి టీ చేసిమ్మని వంటామెకి పురమాయించింది.ఇందిర స్నానం చేసి కూతురికి, అల్లుడికి ఇష్టమైన వంటకమేదైనా చేద్దామని చూసింది, కానీ ఆ పూటకి, మర్నాడు పొద్దున్నకి కూడా వంటామె అప్పటికే తయారు చేసేసింది.నిద్రపోతున్న ప్రియని పడుకోబెట్టి, వచ్చి భోజనాలు అమరుస్తున్న కూతురికి సాయం చేస్తూ అల్లుడిని కుశలప్రశ్నలు వేసింది ఇందిర. భోజనాల దగ్గర అతను చెబుతున్నాడు, ‘‘ఆంటీ, మీ మాట మీద భలే గురి రూపకి. ఏ విషయమైనా అమ్మని అడుగుతాను అంటుంది. తన ఉద్యోగం వరకూ మాత్రం స్వంతంగా చూసుకుంటుంది’’ రూప మౌనంగా భోజనం చేస్తోంది, ఏదో ఆలోచనలో ఉన్నట్టుంది.పాలు కలిపి నిద్రలో ఉన్న ప్రియకి తాగిస్తుంటే ఇందిర చూస్తూ కూర్చుంది. మనవరాల్ని ఎత్తుకుని ముద్దాడాలని ఉన్నా, నిద్రాభంగమవుతుందని ఊర్కుంది.