రవీంద్రభారతి, సెప్టెంబర్‌ 14(ఆంధ్రజ్యోతి): ప్రఖ్యాత సినీ నటి కాంచనకు  శోభన్‌బాబు-వంశీ పురస్కారాన్ని ప్రదానం చేశారు. శుక్రవారం రవీంద్రభారతిలో వంశీ ఆర్ట్స్‌ థియేటర్‌ 46వ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథులుగా ప్రముఖ నటి జమున, ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారి, సినీ దర్శకుడు కోడి రామకృష్ణ, భరద్వాజ, గీతాంజలి, కవిత, సంగీత, రాధాప్రశాంతి తదితరులు హాజరై నటి కాంచనను  ఘనంగా సత్కరించారు. ఇందులో భాగంగా పలు రంగాల్లో నిష్ణాతులైన దిలీ్‌పరెడ్డి, రామచంద్రమౌళి, వడ్డేపల్లి కృష్ణ, గౌరీశంకర్‌, పద్మజారెడ్డి, విజయ్‌యాదవ్‌, సంగీత కళ-రాజ్యలక్ష్మి, బైరోజు వెంకటరమణాచారి, వి.వి.రామారావు, అమరేంద్ర, వడ్డేపల్లి శ్రీనివాస్‌, అర్జున్‌, రాజేశ్వరరావు, షేక్‌ నఫీ్‌సలను కళారత్న పురస్కారాలతో సన్మానించారు. ఈ సందర్భంగా జమున మాట్లాడుతూ కాంచన అద్భుతమైన నటి అన్నారు. రమణాచారి మాట్లాడుతూ కాంచన నటనను తెలుగు ప్రేక్షకులు మరువలేరని అన్నారు. వంశీరామరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో రాఘవేంద్రప్రసాద్‌, మహ్మద్‌ రఫీ, యలవర్తి రాజేంద్రప్రసాద్‌, రాఘవాచారి, తెన్నేటి సుధాదేవి, శైలజ తదితరులు పాల్గొన్నారు. సభకు ముందు చాగంటిపాటి లక్ష్మణస్వామి దర్శకత్వంలో ‘ఆ కోరిక తీరేదెలా’ హాస్య నాటికను ప్రదర్శించారు.