బాలానగర్‌, నవంబర్‌ 12(ఆంధ్రజ్యోతి): ఉత్తమ సాహిత్యానికి ఎప్పుడూ ఆదరణ ఉంటుందని  ప్రముఖ మళయాళీ రచయిత, సినిమా  డైరెక్టర్‌ సి. రాధాకృష్ణన్‌  అన్నారు. బాలానగర్‌ ఫిరోజ్‌గూడకు చెందిన నవీన సంస్కారికా కళా కేంద్రం(ఎన్‌ఎ్‌సకేకే) స్కూల్‌ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి నిర్వహించిన వోవివిజన్‌ సాహిత్య పురస్కార్‌ అవార్డు ప్రదానోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ కేరళనుంచి హైదరాబాద్‌ మహానగరానికి వచ్చి సెటిలైనప్పటికీ  పుట్టిన ఊరు, మాతృభాషపై మహకారంతో ఉత్తమ రచయితలు, సాహితీ వేత్తలను గుర్తించి వారిని సత్కరించడం అభినంద నీయమన్నారు. అనంతరం 2018గానూ భౌమచాపం అనే పుస్తకాన్ని రచించిన  సీఎస్‌. మీనాక్షిని ఎంపిక చేసి  ఆమెకు వోవివిజన్‌ సాహితీ పురస్కార కింద రూ. 50 వేల నగదు , జ్ఞాపికతో సత్కరించారు. ఈ సందర్భంగా స్కూలు విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు  ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో నందిని సిధారెడ్డి, రచయితలు నీలకాంతన్‌, లీలాకృష్ణన్‌, ఎన్‌ఎ్‌సకేకే చైర్మన్‌ థంపన్‌, నందకుమార్‌,  స్కూలు కార్యదర్శి ఉన్నున్నీ తదితరులుపాల్గొన్నారు.