సంస్మరణ సభలో తెలుగు వర్సిటీ వీసీ సత్యనారాయణ

15-10-2017: కార్టునిస్ట్‌ మోహన్‌ ప్రగతిశీల శక్తుల చేతిలో కాగడాగా, కుంచెగా, కలంగా, బొమ్మగా, మాట, పాట, ఆటగా ఉన్నాడని తెలుగు విశ్వవిద్యాలయం వీసీ ఎస్వీ సత్యనారాయణ అన్నారు. కార్టునిస్టు మోహన్‌ సంస్మరణ సభ శనివారం ఉదయం తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఎస్వీ సత్యనారాయణ మాట్లాడుతూ మోహన్‌లో ఒక కవి, రచయిత, చిత్రకారుడు ఉన్నాడని పొగిడారు. మోహన్‌ వృత్తి, సిద్ధాంత స్పర్థలకు అతీతుడని, ఆయన ఇల్లు ఒక కళా నిలయమని కొనియాడారు. మోహన్‌ మృతికి ఉత్తమ మానవునికి అభ్యుదయ రచయితల సంఘం, తెలుగు విశ్వవిద్యాలయం తరపున నివాళి అర్పిస్తున్నామన్నారు. ప్రముఖ సీనియర్‌ ప్రాతికేయుడు రామ చంద్రమూర్తి మాట్లాడుతూ మోహన్‌ కార్టూనిస్టు మాత్రమే కాదనీ, మంచి రచయిత అనీ, వామపక్ష సిద్ధాంతాలను బాగా నమ్మిన వ్యక్తి అని అన్నారు. మోహన్‌ లాంటి స్నేహితుడిని కోల్పోవడం పెద్ద లోట న్నారు. ప్రజా కవి గోరటి వెంకన్న మాట్లాడుతూ మోహన్‌ గీసిన పిట్ట బొమ్మలను చూసి ఓ పుల్లా.. ఓ పుడుక, ఎండు గండి, సిన్న కొమ్మ, సిట్టిగూడు, పిట్ట బతుకు ఎంతో హాయి అనే పాట రాశానన్నారు. ఆయన తనకు జ్ఞానం పంచిన పరోక్ష గురువని, ఆయన చెప్పిన విష యాలతోనే అనేక పాటలు కొత్త వైవిధ్యంతో రాసానన్నారు. మోహన్‌ సంస్మరణ సభ సందర్భంగా ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. సభ లో సీనియర్‌ జర ్నలిస్ట్‌ పాశం యాదగిరి, దేవిప్రియ, కందిమల్ల ప్రతాప రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, కవి సిద్ధార్థ, భవాని, విమల పాల్గొన్నారు.