చిక్కడపల్లి, మే 23 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ సినీ, టీవీ నటి, శాస్త్రీయ నృత్యకళాకారిణి జయలలితకు రాగరాగిణి ఆధ్వర్యంలో స్వర్ణపతకం, ప్రజ్ఞా పురస్కారాన్ని ప్రదానం చేశారు.  బుధవారం రాత్రి త్యాగరాయ గానసభలో జరిగిన కార్యక్రమంలో మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య అతిథిగా పాల్గొని జయలలితను సన్మానించి పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఆయన మాట్లాడుతూ చలనచిత్రసీమలో సీనియర్‌ క్యారెక్టర్‌ యాక్టర్‌గా తెలుగు, తమిళ, మలయాళం, హిందీ భాషల్లో నటించి, వెయ్యి స్టేజ్‌ షోలలో వివిధ పాత్రలు పోషించిన ప్రఖ్యాత నటి జయ లలిత అని అభినందించారు. కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం పూర్వ కమిషనర్‌ పి.విజయబాబు, సర్వమంగళగౌరి, ఎన్‌.రవికుమార్‌, విజయకుమార్‌, నిరంజన్‌, సుధాకర్‌రెడ్డి, నిర్వాహకులు రమణకుమారి, సుబ్బలక్ష్మి పాల్గొన్నారు.