కైకాలకు జీవిత సాఫల్య పురస్కారం
మంగళగిరి, గుంటూరు: ప్రముఖ సినీనటుడు కైకాల సత్యనారాయణకు జీవిత సాఫల్య పురస్కార అవార్డును అందజేస్తున్నట్టు ఏపీ చలనచిత్ర వాణిజ్య మండలి ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ అంబటి మధుమోహనకృష్ణ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఆత్మకూరు హ్యాపీరిసార్ట్స్లో శుక్రవారం విలేకర్ల సమావేశంలో ఆయన ఈ విషయం ప్రకటించారు. శనివారం సాయంత్రం హ్యాపీరిసార్ట్స్లో ఉగాది పురస్కారాల సంబరాల కార్యక్రమంలో సత్యనారాయణకు అవార్డును అందజేయనున్నట్టు చెప్పారు.