నల్లకుంట, మార్చి 22 (ఆంధ్రజ్యోతి):  ప్రముఖ షెహనాయి విద్వాంసుడు బిస్మిల్లాఖాన్‌ సంగీతంలో మహనీయుడని  తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ చైర్మన్‌ బీఎ్‌స.రాములు అన్నారు. బిస్మిల్లాఖాన్‌ జ్ఞాపకాలను సమాజానికి పంచడం అభినందనీమన్నారు. శుక్రవారం హైదర్‌గూడలోని ఎన్‌ఎ్‌సఎ్‌సలో ఆకృతి సంస్థ ఆధ్వర్యంలో ప్రముఖ సంగీత విద్వాంసుడు బిస్మిల్లాఖాన్‌  జయంతి  జరిగింది.  ముఖ్యఅతిథిగా హాజరైన రాములు మాట్లాడుతూ సంగీతానికి ఎల్లలు లేవని, కృషి, పట్టుదలతో నేటి యువతరం షెహనాయి వంటి పాతతరం వాయిద్యాలను నేర్చుకోవాలన్నారు. ముఖ్యంగా పలు గురుకులాల్లో విద్యార్థులకు సంగీతం, సాహిత్యాల పట్ల ఆసక్తి కలిగిస్తే  వారు గొప్ప కళాకారులు, కవులుగా తయారవుతారన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ నాదస్వర విద్వాంసుడు ఎన్‌.వెంకటేశ్వర్లును అతిథులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ ఎ.చక్రపాణి, ఆకృతి సుధాకర్‌, కొత్త కృష్ణవేణి  తదితరులు పాల్గొన్నారు.