రెండేళ్లకే కూచిపూడిలో శిక్షణ
మూడేళ్లకే అరంగేట్రం
ప్రదర్శనల్లో ప్రత్యేక ముద్ర
ప్రముఖుల ప్రశంసలందుకున్న చిన్నారి
ఆరేళ్లలో 139 ప్రదర్శనలు 
 
హైదరాబాద్, రవీంద్రభారతి: రెండేళ్ల వయసులోనే కూచిపూడిలో ఓనమాలు దిద్దింది. మూడేళ్ల వయసులో ప్రదర్శనలిచ్చి అబ్బురపరచింది.  నృత్యశైలిలో తనదైన ముద్రతో ప్రముఖుల ప్రశంసలూ అందుకుంది. తొమ్మిదేళ్లలో 139 ప్రదర్శనలు ఇచ్చి ఔరా అనిపించింది. 

హైదరాబాద్‌కు చెందిన బులుసు ప్రసాద్‌, శాంతి దంపతుల కుమార్తె శరత్‌ చంద్రిక. సెయింట్‌ ఆన్స్‌ స్కూల్‌లో నాలుగో తరగతి చదువుతోంది. తల్లిదండ్రులిద్దరికీ నాట్యం అంటే ఇష్టం. అందుకే కుమార్తె నాట్యంలో శిక్షణ ఇప్పించాలని అనుకున్నారు. రెండేళ్ల వయసులోనే శరతచం ద్రికను ప్రముఖ నాట్య గురువు నళిని రమణ వద్ద చేర్పించారు. సంవత్సరంలోనే బాలిక పత్రిభతో ఆకట్టుకుంది. మూడేళ్ల వయసులోనే ప్రదర్శనలు ఇవ్వడం ప్రారంభించింది. సహచరులతో పాటు కలిసి ఇచ్చిన ప్రదర్శనల్లోనూ తన ప్రత్యేకతను చా టింది. ప్రేక్షకులు, గురువుల మన్ననలు పొందుతోంది. నగరంలో ని అన్ని వేదికలపై శరత్‌ చంద్రిక ప్రదర్శనలు ఇచ్చింది. దాంతో గురువు నీళిని రమణి నేర్పించినట్లుగా చక్కటి అడుగులు వేస్తూ కూచిపూడిలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటోంది. 

శరతచంద్రిక నాట్యంలో ప్రత్యేకతలు 
శరతచంద్రిక మేనమామ కూతురు కీర్తిని చూసి నృత్యం పట్ల ఇష్టాన్ని పెంచుకుంది. ప్రత్యేకమైన అంశాలను నేర్చుకుంది. చిన్న వయసులోనే గోధా కల్యాణం అంశాన్ని ప్రదర్శించింది. కుండ మీద నృత్యంతో అలరించింది. దీపాలతో ప్రదర్శన, ఒంటి కాలితో ప్రదర్శనలతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ప్రత్యేకమైన నాట్య విన్యాసాలతో  ఇతరులకు ఆదర్శంగా నిలుస్తోంది.   తమిళనాడు మాజీ గవర్నర్‌ రోశయ్య, డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి, మండలి బుద్దప్రసాద్‌, ప్రముఖ నర్తకీమణి ప్రసన్నరాణి, డికె.అరుణల నుంచి ప్రశంసలు అందుకుంది. 
 
 
శాస్త్రీయ నాట్యం అంటే ఇష్టం
మా అమ్మ నాన్నలకు శాస్త్రీయ సంగీతం, నాట్యం అంటే ఇష్టం. మాకు కూడా వాటిపై మక్కువ పెరింది. మా పాప శాస్ర్తీయనృత్యంలో రాణించాలని అనుకున్నాం. శరత్‌ చంద్రి క కూడా కూచిపూడి నాట్యంలో బాగా రాణిస్తోంది. భవిష్యత్తులో గొప్ప నర్తకి ఎదగాలని  ఆశిస్తున్నా.. 
       - తండ్రి బులుసు ప్రసాద్‌ 
 
గొప్ప నర్తకి   అవుతుంది 

రెండేళ్ల వయసులో నా దగ్గరికొచ్చినప్పుడు శరత్‌ చం ద్రికలో ఇంత టాలెంట్‌ ఉందనుకోలేదు. రోజురోజుకూ ప్ర తిభకు పదును పెట్టుకుంటూ అందరినీ ఆశ్చర్యపరుస్తోం ది. భవిష్యత్తులో గొప్ప నర్తకి అయ్యే లక్షణాలు చంద్రికలో కనిపిస్తున్నాయి. గోధా కల్యాణం నృత్యరూపకంలో అద్భుతంగా నర్తించింది.    

-గురువు నళిని రమణి 

కూచిపూడి నాట్యంలో డిగ్రీలు పొందాలి
నాకు ఊహ తెలుసున్నప్పటి నుంచి నాట్యం చేస్తూనే ఉన్నా ను. నాట్యం నా జీవితంలో భాగంగా మారింది. కూచిపూడి నాట్యంలో డిగ్రీలు పొందాలని ఉంది. చదువు, నాట్యంతో పాటు సంగీతం కూడా నేర్చుకుంటున్నాను. భవిష్యత్తులో గొప్ప నర్తకిగా పేరు తెచ్చుకోవాల న్నదే నా లక్ష్యం  
  - శరత్‌ చంద్రిక