ఉస్మానియా యూనివర్సిటీ, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): భారతదేశపు ప్రాచీన భాష అయిన సంస్కృతాన్ని ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఓయూ రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ గోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. సంస్కృత వారోత్సవాల్లో అంతర్భాగంగా మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న సంస్కృత మహోత్సవం శుక్రవారం ఓయూలోని సంస్కృత అకాడమీలో ప్రారంభమైంది. అకాడమీ డైరెక్టర్‌ నీలకంఠమ్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి అతిథిగా పాల్గొన్న ఓయూ రిజిస్ర్టార్‌ ప్రొఫెసర్‌ గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ పూర్వకాలం నుంచి భారత ప్రజలు సంస్కృతం మాట్లాడటం గర్వకారణం అన్నారు. సంస్కృత భాష గొప్పతనాన్ని వివరించారు. ఈ సందర్భంగా సంస్కృత భాషపై డిగ్రీ విద్యార్థులకు పెయింటింగ్‌, డ్యాన్సింగ్‌ పోటీలను నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రొఫెసర్‌ బి.నరసింహాచార్యులు, దూరదర్శన్‌ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.సుధాకరరావు పాల్గొన్నారు.