సాహిత్య అకాడమీ చైర్మెన్‌ నందిని సిధారెడ్డి

యాదాద్రి, మే22 (ఆంధ్రజ్యోతి): భాషా, సాహిత్యాలను పరిపుష్టం చేయడానికి తెలంగాణ సాహిత్య అకాడమీ కృషి చేస్తోందని అకాడమీ చైర్మెన్‌ నందిని సిధారెడ్డి అన్నారు. మంగళవారం యాదాద్రిలో జిల్లా స్థాయిసాహిత్య సదస్సు ప్రారంభించి మాట్లాడుతూ కొంతమందికి ఏమాత్రం సాహిత్య స్పృహ లేకపోయినా.. శాలువా లు, సన్మానాల కోసం కవులుగా చెలామణీ అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి పరిస్థితులను గమనించిన తర్వాత ఔత్సాహిక సాహితీకారులు, కవులకు భాష, వ్యాకరణం, సంస్కృతిపై అవగాహన కల్పించడానికి సాహిత్య సదస్సులు ని ర్వహించాలని నిర్ణయించినట్టుగా పేర్కొన్నారు. ఈ సదస్సులో సినీ గీతాలు- జీవన చిత్రణ అనే అంశంపై ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ, గేయ కవి త్వం- అవతరణ వికాసం అనే అంశంపై టీ.గౌరీశంకర్‌ ప్రసంగించారు.