హైదరాబాద్‌(ఆంధ్రజ్యోతి), 15-11-2018: తెలుగు సాహిత్యం, సంస్కృతి, కళా ప్రక్రియల్లో విశిష్ఠ సేవలందించిన 12 మందికి తెలుగు యూనివర్సిటీ-2017 సంవత్సరానికి ప్రతిభా పురస్కారాలు దక్కాయి. వర్సిటీ వీసీ ఎస్వీ సత్యనారాయణ అధ్యక్షతన కమిటీ ఎంపిక చేసిన వారిలో.. దేవులపల్లి అమర్‌(పత్రికారంగం), పీవీ సునిల్‌ కుమార్‌(కథ/నవల), మొవ్వ వృసాద్రిపతి(కవిత్వం), ద్వానా శాస్త్రి(విమర్శ), జి.రంగారెడ్డి(చిత్రకళ), ఎ.వేలు(శిల్పకళ), భాగవతుల సేతురాం(నృత్యం), నేమాని సోమయాజులు(సంగీతం), పానుగంటి చంద్ర శేఖర్‌(నాటకం), సూర్య భగవంతరావు(జానపదం), ముద్దు రాజయ్య(అవధానం), శిలాలోలిత(ఉత్తమ రచయిత్రి) ఉన్నారని వర్సిటీ రిజిస్ట్రార్‌ అలేఖ్య పుంజాల ఒక ప్రకటనలో బుధవారం తెలిపారు. వీరికి రూ.20,116 నగదు బహుమతిగా అందించి సన్మానిస్తామన్నారు.