సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి

17-09-2017: ప్రపంచాన్ని ఆకర్షిం చిన ఘనత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి దక్కు తుందని సాహిత్య అకాడమీ అధ్యక్షుడు నందిని సిధారెడ్డి ఉ టంకించారు. భారత ప్రభుత్వంలో తెలంగాణ విలీనమైన రో జు సందర్భంగా తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్ట్‌ ఆధ్వ ర్యంలో శనివారం బంజారాహిల్స్‌లోని రావి నారాయణరెడ్డి ఆడిటోరియం వేదికగా తెలంగాణ సాయుధ పోరాటంలో పా ల్గొన్న స్వాతంత్య్ర సమరయోధులకు సన్మాన సభ నిర్వహిం చారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన నందిని సిధారెడ్డి మాట్లాడు తూ జాతిని ప్రభావితం చేసేందుకు చరిత్రను నిలబెట్టుకో వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ, రావి నారాయణ రెడి, సురవరం ప్రతాపరెడ్డి వంటి వైతాళికుల జీ విత విశేషాలను పాఠ్యాంశాల ద్వారా భవిష్యత్తు తరాలకు తెలిపే ప్రయత్నం సాగుతుందన్నారు. ప్రభుత్వ సలహాదారు, కవి, గాయకుడు దేశపతి శ్రీనివాస్‌ మాట్లాడుతూ రైతాంగ సాయుధ పోరాటం లేకపోతే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం లేదని ఉద్ఘాటించారు. పాటలకు స్ఫూర్తి పంథాగా నిలిచింది నాటి సాయుధ పోరాటమేనన్నారు. బెంగాలీ చిత్రకారుడు చిత్తప్రసాద్‌ కుంచెకు కొత్త రేఖను అందించింది రైతాంగ పోరాటమేనన్నారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధుల ను శాలువా, జ్ఞాపికతో సత్కరించారు. స్వాతంత్య్ర సమర యోధులు మల్లు స్వరాజ్యం, జైని మల్లయ్యగుప్త, గార్లపాటి రఘుపతిరెడ్డి, బూర్గుల నరసింగరావు, గుంటకండ్ల పిచ్చిరెడ్డి, ఏటుకూరి కృష్ణమూర్తి, జంగారెడ్డి, కొండవీటి రాధాకృష్ణ, గుర్రం యాదగిరిరెడ్డి, ఉన్నం వెంకయ్య, దొడ్డా నారాయణ రావు, వేమవరపు మనోహర్‌పంతులు, బొమ్మిగాని వెంక టయ్య, కె.రామకోటయ్య, కొంజేటి నారాయణరావు, రావూరి రంగయ్య తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం 69 మంది కవులతో ‘‘తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం’’ అంశంపై కవి సమ్మేళనం నిర్వహించారు. కార్యక్రమంలో కందిమళ్ల ప్రతాప్‌రెడ్డి, ఆచార్య ఎస్వీ సత్యనారాయణ, రాపోలు సుదర్శన్‌ తదితరులు పాల్గొన్నారు.