రవీంద్రభారతి, మార్చి 16 (ఆంధ్రజ్యోతి): సాహిత్య, సాంస్కృతిక వారసత్వాన్ని భవిష్యత్తు తరానికి అందించే ప్రయత్నం జరగాలని ప్రముఖ కవి కె.శివారెడ్డి అన్నారు. శుక్రవారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో తిరురంగ ప్రచురణలు, తేజ ఆర్ట్‌ క్రియేషన్స్‌ సంయుక్తాధ్వర్యంలో ప్రముఖ కవి, అనువాదకులు నాగరాజు రామస్వామి రచించిన ’సూర్యశిల’, ‘ఎద పదనిసలు’, ‘అనుస్వనం’ గ్రంథాల ఆవిష్కరణోత్సవం జరిగింది. దీనికి ము ఖ్య అతిథిగా కె.శివారెడ్డి హాజరై పుస్తకాలను ఆవిష్కరించి మాట్లాడారు. నేటితరం కవులు చిన్న, చిన్న కవితలు కాకుండా దీర్ఘ కవిత్వం రాసే ప్ర యత్నం చేయాలని అన్నారు. నాగరాజు రామస్వామి అద్భుతమైన గ్రంథాలను రచించారని చెప్పారు. సాహిత్య అకాడమీ కార్యదర్శి ఏనుగు నరసింహారెడ్డి మాట్లాడుతూ రచయిత నాగరాజు రామస్వామి రచనలు గొప్పగా ఉంటాయన్నారు. ఈ సభకు ప్రముఖ సాహితీవేత్త తిరునగరి సభాధ్యక్షత వహించగా సాహితీవేత్తలు అమ్మంగి వేణుగోపాల్‌, గంగిశెట్టి లక్ష్మీనారాయణ, పి.లక్ష్మీనారాయణ, తిరునగరి దేవకిదేవి, తుమ్మూరి రామ్మోహన్‌రావు, పోరెడ్డి రంగయ్య తదితరులు పాల్గొన్నారు.