రాంగోపాల్‌పేట్‌,హైదరాబాద్: మ్యూజికాలజిస్ట్‌ డా.రాజా రచించిన ‘ఆ పాత మధురం’ పుస్తకావిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. 1951 నుంచి 1955 మధ్యకాలంలో వచ్చిన సినిమాల్లోని మంచి పాటల సంకలనంతోపాటు వాటి గురించి వివరిస్తూ రచించిన ఈ పుసకాన్ని పారిశ్రామికవేత్త వరప్రసాద్‌రెడ్డి ఆవిష్కరించి ప్రముఖ పాత్రికేయుడు కె.రామచంద్రమూర్తికి అందజేశారు. ఈ పుస్తకాన్ని ముధుసూధన శర్మకు అంకితమిచ్చారు. ‘‘గోవిందరావు, నారాయణరెడ్డి, బాలసుబ్రహ్మణ్యం, వరప్రసాద్‌రెడ్డి ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి చేరుకోగలిగాను’’ అని రాజా అన్నారు. రాజాను ‘సినీ గీత పరిశోధక శిరోమణి’గా వక్తలు కొనియాడారు. ఇటీవల వచ్చిన పాటలపై మరో పుస్తకం తీసుకొస్తే తానే ముద్రణ వేయిస్తానని వరప్రసాద్‌రెడ్డి అన్నారు.