రవీంద్రభారతి, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): లయబద్ధమైన నాట్యాంశాలకు వైవిధ్యభరితంగా నర్తించిన యువ నర్తకి అఖిల హర్షిణి ఆహుతుల్ని సమ్మోహనపరిచింది. ఆకట్టుకునే హావభావాలు చక్కటి వస్త్రాధారణతో ప్రేక్షకులను రంజింపజేసింది. ఆదివారం రవీంద్రభారతిలో ప్రముఖ నాట్య గురువు అజయ్‌ చక్రవర్తి శిష్యురాలైన అఖిల హర్షిణి కూచిపూడి నాట్యంలో రంగప్రవేశం చేసింది. ఈ సందర్భంగా గణపతి తాళం, పాదం, శంకరా శ్రీగిరి, భామకలాపం, తరంగం, మంగళం తదితర అంశాల్లో నర్తించి భళా అనిపించింది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని అఖిల హర్షిణిని సత్కరించి అభినందించారు.