హైదరాబాద్,ఆంధ్రజ్యోతి: శాస్త్రీయ నృత్యాల న్నింటినీ ఒకేచోట ప్రదర్శించి కళాకారులు సభికులను రంజింపజేశారు. మర్రి చెన్నా రెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో కథక్‌కళాక్షేత్ర, హైదరాబాద్‌ ఆధ్వర్యంలో చతుష్టకళ నృత్యహేళ పేరిట మంగళవారం జరిగిన కార్యక్రమంలో కథక్‌, మోహినీఆటమ్‌, భరతనాట్యం, ఒడిస్సీ నృత్యం, తదితరాలను కళాకారులు అద్భుతంగా చేసి సభికులను ఆకట్టుకున్నారు. ఈ ప్రదర్శనను ఎంసీహెచ్‌ఆర్‌డీ డైరెక్టర్‌ జనరల్‌ వినోద్‌ అగ్రవాల్‌ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జాయింట్‌ డైరెక్టర్‌ అనితాబాలకృష్ణ, నిర్వాహక ప్రతినిధులు చీకోలు సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.