హైదరాబాద్,ఆంధ్రజ్యోతి:వాగ్దేవి సంగీత విద్యాలయం ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో సోమవారం త్యాగరాజ ఆరాధనోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారిని వాగ్దేవి సంగీత విద్యాలయం ప్రిన్సిపల్‌, డైరెక్టర్‌ తాడేపల్లి సుబ్బలక్ష్మి, ఉమాశంకర్‌ సత్కరించారు.