హైదరాబాద్,ఆంధ్రజ్యోతి: జ్ఞానపీఠ పురస్కార గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ తెలుగు సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేశారని ఎస్సీ క మిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ చెల్లప్ప పేర్కొన్నారు. ఆయన సాహి త్యం నేటికీ నిత్యనూతనమేనని, అయన రచనలు అన్ని వర్గాలు, జాతులు, మతాల వారిని ఆకర్షిస్తాయనడంలో ఎ లాంటి సందేహమూ లేదని ఆయన తెలిపారు. ఓయూ ఆంధ్రమహిళాసభ కళాశాలలో తెలుగు సాహిత్య కళాపీఠం, మాసన ఆర్ట్స్‌ థియేటర్‌ సంయుక్త ఆధ్వర్యంలో విశ్వనాథ సత్యనారాయణ రచనలపై శుక్రవారం నిర్వహించిన సాహి త్య సమాలోచన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రచయితలు అక్కిరాజు, జాన్సన్‌, రమాపతి, రగుశ్రీ, సూర్యనారాయణ, అనంతలక్ష్మి, వాణి పాల్గొన్నారు.