చిక్కడపల్లి, జూన్‌2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం ఏర్పడిన నాలుగేళ్లలోనే వందేళ్ళ ప్రగతి సాధించిందని తెలంగాణ బీసీ కమిషన్‌ సభ్యుడు డా. వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అన్నారు. త్యాగరాయగానసభ ఆధ్వర్యంలో శనివారం రాత్రి గానసభలో తెలంగాణ అవతరణ దినోత్సవం  నిర్వహించారు. ఈ సందర్భంగా వకుళాభరణం కృష్ణమోహన్‌రావు మాట్లాడుతూ నాలుగేళ్లలోనే తెలంగాణ అన్నిరంగాలలో దేశంలోనే నెంబర్‌ వన్‌గా నిలబడడం మన రాష్ట్ర ప్రజలకు గర్వకారణమన్నారు. అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోన్న నెంబర్‌ వన్‌ సంక్షేమ రాష్ట్రం మనదే కావడం గమనించదగిందన్నారు. రైతును రాజును చేసిన రాష్ట్రం మనదే అన్నారు. ఈ కార్యక్రమంలో గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, ప్రముఖ కథా రచయిత డా. కాలువ మల్లయ్య, గాయకుడు జీ ఎస్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.