మోర్తాడ్‌, ఫిబ్రవరి 7:నిజామాబాద్ జిల్లాలోని మోర్తా డ్‌ మండల కేంద్రంలో వందేళ్ల క్రితం రచిం చిన ప్రచండ చతుష్క వియమ అనే హరికథ గ్రంథం వెలుగులోకి వచ్చింది. మోర్తాడ్‌ లోని పండిత కుటుంబానికి చెందిన శిరచినహల్‌ వరదాచార్యులు ప్రచంద చతుష్క వియమ పేరుతో హరికథామృతాన్ని రచించారు. ఈయన ఈ గ్రంథాన్ని 20ఏళ్ల వయసు లోపే రచించారు. ఈయనకు ‘బాలవిద్వత్‌ క వి’గా పేరుంది. కాగా ఆయన సోదరులు ఉబయ వేదాంత విద్వన్‌, పరిశోధకులు, శతావ ధానులు, కృష్ణమాచార్యులు పరిశోధించి ఈ గ్రంథాన్ని ప్రచురణకు సిద్ధం చేశారు. వరదా చార్యులు 25 ఏళ్ల వయస్సులో కలరా (ప్లేగు) వల్ల పరమపదించారు. ఆయన మరణించిన 50 ఏళ్లకు 1970లో స్థానిక గౌడ సంఘం పెద్ద లు ఈ గ్రంథాన్ని ముద్రించేందుకు ఆర్థిక స హాయం అందించారు. మోర్తాడ్‌లోని వేంకటే శ్వర స్వామికి ఈ గ్రంథాన్ని అంకితం చేశా రు. మోర్తాడ్‌కు చెందిన వెంకటాచార్యులు, రంగమ్మకు వీరు ఐదుగురు సంతానం. పెద్దవారు శ్రీనివాసాచార్యులు. ఈయన దండ బండలింగాపురం ఆస్థాన పండితుడిగా ఉండి రి. రెండోవారు వరదాచార్యులు (గ్రంథరచ యిత). వీరు బాల్యంలోనే నాటకాలు, ఆంధ్ర భాషా పరిజ్ఞానాన్ని సంపాదించి ఇందుమతి పరిణయం, మరికొన్ని గ్రంథములు రచించా రు. కాగా అవి లభించలేదు. మూడోవారు కృష్ణమాచార్యులు. వీరుకూడా పరిశోధకులు, శతవధానులు. వీరు కోరుట్లలో స్ధిర నివాసం ఉన్నారు. మిగతా వారు కూడా పండితులే. 

మోర్తాడ్‌ వేంకటేశ్వర స్వామియే  ఈ గ్రంథరచనకు ప్రేరణ 

ప్రాచీన కాలంలో తపసిద్ధి గల మహాత్ము డు వృద్ధాప్యంలో తిరుపతికి వెళ్లలేక స్వామి నాకు దర్శనం ఇవ్వవా అని ప్రార్థించెనట! అ ప్పుడు స్వామివారు స్వప్నంలో సాక్షాత్కరించి నన్ను ఈ రూపంలో ప్రతిష్ఠించి పూజించ మ ని, ప్రజలకు దర్శనమిచ్చి వారి కోరికలు నెరవే రుస్తానని చెప్పగా.. ఆ మహాత్ముడు వేంక టేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడని ప్రాచీన కథ ప్రచారంలో ఉంది. స్థానిక జమీం దార్‌ దేశ్‌ముఖ్‌ గడ్డం గంగారెడ్డి నూతన ఆల య మండపం కట్టించి కల్యాణ రథోత్సవం వైభవంగా చేస్తుండేవారు. పౌర్ణమి నాడు ధ ర్మపురిలో డోలోత్సవములు సేవించి విదియ నాడు మోర్తాడ్‌ వేంకటేశ్వర స్వామివారి రథో త్సవంలో పాల్గొంటే సకల కోరికలు నెరవే రుతాయని ప్రజల నమ్మకం. అయితే వేంకటే శ్వర స్వామి రథోత్సవముకు ఒక రోజు ముం దు దూపకము జరుగుతాయి. ఆనాడు గ్రామ స్థులకు హరికథ చెప్పడం ఆచారం. అప్పుడు సరైన హరికథ లేకపోవడంతో వరదాచా ర్యులు తొందరగా ప్రచండ చతుష్కవీము అనే హరికథను రాశారు. దీన్ని హరికథ చె ప్పే వారికి  నేర్పించి, హరికథ కాలక్షేపం చే యించి పండితులతో పాటు  ప్రజల మెప్పు పొందారు. 

ఈ గ్రంథం వెలుగులోకి తేవడానికి ఎంతో ప్రయత్నించాం   
వేంకటేశ్వర స్వామిపై రచించిన హరి కథ గ్రం థం ఉందని తెలిసి ఆ పుస్తకం కోసం ఎంతో ప్ర యత్నించాం. స్థానిక జమీందార్‌లు, దేశ్‌ ముఖ్‌ల కుటుంబాల వారిని సంప్రదించి వెతికించాను. అయినా దొరకలేదు. చివర కు ఈ గ్రంథాన్ని సంపాదించాను. ఈ గ్రం థంలో మోర్తాడ్‌ చరిత్ర, వేంకటేశ్వర స్వా మి ఆలయ చరిత్ర కూడా ఉంది. 
దంపూరి ప్రవీణ్‌ ఆచార్యులు , వంశపారం పర్య అర్చకులు , వేంకటేశ్వర స్వామి దేవాలయం , మోర్తాడ్‌