40 నెలల చిన్నారి జాగృతి రికార్డు

ఏలూరు అర్బన్‌, సెప్టెంబరు 8: ఆ చిన్నారి వయసు 40 నెలలు... నిమిషానికో పద్యం చొప్పున 40 నిమిషాల్లో 40 పద్యాలు చెప్పేసింది. తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. ఏలూరుకు చెందిన చిన్నారి జాగృతి తన పద్యధారణ శక్తిని ప్రదర్శించింది. ఇక్కడి శాంతినగర్‌ ఎస్‌కే విద్యా సంస్థల ది స్కూల్‌ ఆఫ్‌ నాలెడ్జ్‌ ప్రాంగణంలో ఈ ప్రదర్శన జరిగింది. ఏలూరుకు చెందిన గిన్నిస్‌ రికార్డు హోల్డర్‌ డాక్టర్‌ నారాయణం శివశంకర్‌, సుగుణ దంపతుల కుమార్తె అయిన జాగృతి చేసిన శతక పద్యధారణ కార్యక్రమానికి తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌ ప్రతినిధి సాయిశ్రీ హాజరయ్యారు. జాగృతి ప్రతిభను మెచ్చుకొంటూ జ్ఞాపిక, ప్రశంసాపత్రాలను అందించారు