విజయవాడ, జూలై 9 (ఆంధ్రజ్యోతి): ప్రపంచ తెలుగు రచయితల నాలుగో మహాసభలకు విజయవాడ వేదిక కాబోతోంది. డిసెంబర్‌ 27 నుంచి 29 వరకు సిద్ధార్ధ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్టు కృష్ణా జిల్లా రచయిత సంఘం తెలిపింది. ఈ మహాసభలకు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు రచయితలు హాజరవుతారని స్పష్టం చేసింది.