10-07-2019 (వాషింగ్టన్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి): అమెరికన్‌ తెలుగు అసోసియేషన్‌(ఆటా) 16వ మహాసభలు వచ్చే ఏడాది జూలై 3, 4, 5వ తేదీల్లో హాలీవుడ్‌ రాజధాని లాస్‌ఏంజిల్స్‌లో నిర్వహిస్తారు. ఈ మహాసభలకు ఏపీ, తెలంగాణ సీఎంలు వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి, కేసీఆర్‌లను ముఖ్యఅతిథులుగా ఆహ్వానిస్తామని ఆటా అధ్యక్షుడు పరమేశ్‌ భీమిరెడ్డి తెలిపారు.