రవీంద్రభారతి, జూన్‌ 6 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ, తెలుగు భాషా చైతన్య సమితి సంయుక్త ఆధ్వర్యంలో డాక్టర్‌ సాహెబ్‌జాదా విజయభాస్కర్‌ రచించిన ‘అక్షర భాస్కరం’ పుస్తకావిష్కరణ సభ బుధవారం రవీంద్రభారతి కాన్ఫరెన్స్‌ హాల్‌లో జరిగింది. అతిథిగా తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్‌ నందిని సిధారెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ విజయభాస్కర్‌ వైవిద్యభరితమైన కవితలు రాశారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం సాహిత్యాభివృద్ధికి కృషి చేస్తున్నదని అన్నారు. ఇలాంటి పుస్తకాలు మరిన్ని రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో సాహితీవేత్త ద్వానాశాస్త్రి, ప్రత్తిపాక మోహన్‌, చందోజీరావు తదితరులు పాల్గొని రచయితను అభినందించారు.